Varalakshmi Vratam 2024: గర్భిణీ స్త్రీలు వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చా.. పండితులు ఏమంటున్నారు..

శ్రావణ మాసం.. నోముల మాసం సోమవారం ( ఆగస్టు 5)న ప్రారంభం కానుంది.   శ్రావణమాసంలో ముత్తైదువులు అందరూ వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు.  ఈ ఏడాది( 2024) వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 16 వచ్చింది.  అయితే అయితే గర్భిణీలు వరలక్ష్మీ వ్రతం చేయవచ్చా అనే సందేహం చాలా మందికి వస్తుంది. ఈ విషయంలో పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. . .

శ్రావణమాసం ఎంతో పవిత్రమైనది.  శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండగ వాతావరణం ఏర్పడుతుంది.. ఈ శ్రావణ మాసంలో మహిళలందరూ చాలా రకాలైనటువంటి నోములు, వ్రతాలు చేసుకుంటారు. ఇది ఎంతో శుభకరం అని వారు భావిస్తారు.లక్ష్మీదేవిని పూజించడం ద్వారా వారికి సకల సంపదలు కలుగుతాయని నమ్మకం. వరలక్ష్మీ వ్రతం చేయడం వల్ల ఆర్దికంగా కూడ ఎటువంటి సమస్యలు రావని నమ్మకం. అంతేకాకుండా వారి భర్త ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం కూడా బాగుండాలని స్త్రీలు ఉపవాసాలు ,వ్రతాలు చేస్తారు. 

అయితే గర్భిణీ స్త్రీలు కూడా నిస్సంకోచంగా వరలక్ష్మీ వ్రతాన్ని చేయవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.సాధారణ మహిళలు చేసిన విధంగానే వరలక్ష్మీ వ్రతాన్ని గర్భిణి స్త్రీలు కూడా చేసుకోవచ్చు.అయితే గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండకూడదని, ఉపవాసంతో వ్రతం చేయడం వల్ల వారి కడుపులో పెరిగే బిడ్డ పై ప్రభావం పడుతుందని, గర్భిణీ స్త్రీలు పూజ అనంతరం అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.కానీ పిల్లలకు జన్మనిచ్చి 22 రోజుల వ్యవధి దాటని వారు మాత్రం ఈ వ్రతం ఆచరించకూడదని పండితులు చెబుతున్నారు.

అయితే వరలక్ష్మీ వ్రతం చాలా నిష్టతో కూడుకున్నది. అదే విధంగా పని ఎక్కువగా ఉంటుంది. ఇల్లు అంత శుభ్రం చేసుకోవడం రకరకాల నైవేద్యాలు ,పిండి వంటలు చేయడము ఇవన్నీ కూడా కొంత శ్రమతో కూడుకున్నవి. కాబట్టి గర్భిణీ స్త్రీలు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు మీ ఇంట్లో వాళ్ల సహాయంతో వరలక్ష్మీ వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఆ తల్లి చల్లని దీవెనలు మీకు ఎప్పటికీ ఉంటాయని పండితులు చెబుతున్నారు.