Health News: వర్షాకాలం.. ఫీవర్​ కాలం.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..

ముసురు పట్టిందంటే ఆరోగ్యానికి ముప్పు వచ్చినట్టే.. చినుకు పడితే చిన్నపిల్లలకు తుమ్ములే. చలి. గాలి వీచిందంటే ఇంటింటా వైరల్ ఫీవర్లే, ఈ ఫీవర్ ఫియర్ చిన్న పిల్లల తల్లిదండ్రులకు ఈ సీజన్లో తప్పేది కాదు. ఈ సీజన్ ను సేఫ్ గా దాటాలంటే  పేరెంట్స్​ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . . 

 కొంతమందికి వాతావరణం చల్లగా మారిన రెండో రోజే  దగ్గు మొదలవుతుంది.  ఈ దగ్గు  వారం రోజులు  అయినా తగ్గకపోతే చాలా ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. వైరస్, బాక్టీరియా వ్యాప్తి చెందడానికి తడి వాతావరణం ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్లు ఇంటిలో చల్లగాలి రాకుండా జాగ్రత్తపడాలి. 

వర్షాకాలం  దోములు ఎక్కువగా ఉండే సీజన్ వాటి నుంచి తప్పించుకునేందుకు ఫ్యాన్ ఎక్కువ స్పీడ్ పెడితే.. పిల్లలు దగ్గు, జలుబుతో ఇబ్బంది పడతారు అప్పుడు వాళ్లకు చల్లని వాతావరణం పడదని గుర్తించాలి. ఫ్యాన్​ ను తక్కువ స్పీడ్​ లోనే పెట్టాలి. పిల్లలకు  పొడి దుస్తులు వేయాలి వాతావరణం బాగా చల్లగా ఉన్న రోజుల్లో గది వాతావరణం వెచ్చగా ఉంచేందుకు ప్రయత్నించాలి. వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లూ చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటు చేయాలి. పెద్దవాళ్లు కూడా ఇది పాటించాలి. ఇలా చేస్తూ తరచూ జలుబు, దగ్గుతో బాధపడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. చల్లని వాతాచరణం ఉన్నప్పుడు తీపి పదార్థాలు (బిస్కెట్లు, చాక్లెట్లు) ఇవ్వొద్దు. ఇలా చేస్తే దగ్గు రాదు. ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్లు తొందరగా కోలుకుంటారు.. 

అయినా కొంతమంది పిల్లలు  దగ్గు తీవ్రంగా లేకపోయినా కానీ  తినేటప్పుడు ఇబ్బంది పడతారు.  అలాంటి వారు ఫుడ్​ విషయంలో  కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  దగ్గుతో ఇబ్బంది పడే పిల్లలకు మింగడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. వర్షాకాలం  సీజన్లో తియ్యగా పుల్లగా ఉన్న ఆహారం. ఇవ్వకూడదు.. వాళ్లు మింగడానికి ఇబ్బంది పడుతున్నారనిపిస్తే సాఫ్ట్ ఉన్న ఫుడ్ ఇవ్వాలి. ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఇవి బాగానే ఉంటారు. పిల్లలకు, సమస్య పోయేంత వరకు పెద్దవాళ్లకు, పిల్లలకే వేరువేరుగా వంట చేయాలి.కొంతమంది పేరంట్స్​ పిల్లలకు జ్వరం వస్తే స్నానం చేయించరు. కాని వేడి నీటితో స్నానం చేయించాలి. జ్వరం వస్తే స్నానం చేయించాలి. కాని  ఎక్కువ సేవు స్నానం చేయించకూడదు
 స్నానం చేయిస్తే పిల్లలు కొంచెం యాక్టివ్ ఉంటారు. మంచిగా నిద్రపోతారు. తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. జ్వరంతో బాధపడే పిల్లలకు రోజుకు ఒకసారి స్నానం చేయించాలి. . 

పిల్లలకు జ్వరం తగ్గిన  కొద్ది రోజులకే వాళ్లకు ఇష్టమైన ఏదైనా ఇవ్వొచ్చు. సాధారణ జ్వరం ఉన్నప్పుడు నాన్ వెజ్ ఇవ్వకూడదు. తగ్గిన కొద్ది రోజులకు ఇవొచ్చు. నాన్ వెజ్ పెట్టడం అనేది జ్వరం ఎందుకు వచ్చిందనే విషయంపై ఆధారపడి ఉంటుంది. లివర్ డిసీజ్ ఉన్న వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ ఇవ్వకూడదు. వ్యాధి తీవ్రతను (లివర్ ఫెయిల్యూర్ స్టేజ్)ని బట్టి ఎన్ని రోజులు ఇవ్వకుండా ఉండాలో డాక్టర్లు చెబుతారు. నాన్​ వెజ్​ను ఆపడమే కాదు మసాలా కారం కూడా తగ్గించాలి.

 జ్వరం వస్తే సాధారణంగాపారాసిటమాల్ టాబ్లెట్ ఇస్తాం. కాని అలా వేసుకున్న రెండు .. మూడు గంటలకు తగ్గి.. మరల ఓ గంట తరువాత జ్వరం వస్తుంది. అలాంటప్పుడు బ్లడ్​ టెస్ట్​ చేయించాలి.  మలేరియా, డెంగ్యూ అని రక్త పరీక్షలో తేలితే.. దానికి సంబందించి  ట్రీట్​ మెంట్​ తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు పారాసిట్​ మాల్​ తోపాటు యాంటీబయాటిక్స్​ వాడాల్సి ఉంటుంది.