ప్రజావాణిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : ప్రజావాణిలో వచ్చిన  ఫిర్యాదులను పెండింగ్​లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లా కలెక్టరేట్లలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణికి వచ్చిన 64 ఫిర్యాదులను యాదాద్రి కలెక్టర్​ హనుమంతరావు స్వీకరించారు. వాటిని పరిశీలించి డిపార్ట్​మెంట్ల వారీగా ఫార్వర్డ్​చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. భూ సంబంధించినవి 39 ఫిర్యాదులు వచ్చాయని, అన్ని డిపార్ట్​మెంట్లు కలిపి 25  వచ్చాయని అధికారులు తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, జడ్పీ సీఈవో శోభారాణి, ఏవో జగన్మోహన్​ ప్రసాద్​పాల్గొన్నారు. 

ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి 

ప్రజావాణి లో వచ్చే ప్రతి దరఖాస్తుడి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేచించారు. ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి అర్జీదారుల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో భూ సమస్యపై 32 దరఖాస్తులు, డీఆర్డీవో 7, మున్సిపాలిటీ 4, డీపీవో 1, డీఏవో 2, డీఎంహెచ్ వో 3,  ఇతర శాఖలకు సంబంధించి 23, మొత్తం 72 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

నల్గొండలో 66 దరఖాస్తులు ..

ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 66 దరఖాస్తులు వచ్చాయి.