సమస్యల పరిష్కారానికే ప్రజావాణి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తోందని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖీమ్యా నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు కలిపి మొత్తం 110 దరఖాస్తులు వచ్చాయన్నారు. 

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 31 అర్జీలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.  ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు లత, గౌతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆర్డీవోలు మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్, దివాకర్, కలెక్టరేట్ ఏవో హన్మంతరావు, అధికారులు పాల్గొన్నారు. 

గల్ఫ్ కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన మారంపల్లి సుధీర్ అప్పుల బాధతో బహ్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గత నెల 23న ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి తహసీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో నిర్వహించిన ప్రజావాణిలో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడి భార్యతోపాటు కుటుంబసభ్యులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.