కోరుట్లలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు

తెలంగాణలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ఈ కార్యక్రమంలో అన్ని చోట్ల స్థానిక అధికారులు.. ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.  

జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్​ అధికారుల ఆధర్వంలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరిగాయి.  ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని చెత్తకుప్పల ప్రదేశాలను శుభ్రపరచి ముగ్గులు వేశారు.  ఇంకా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మున్సిపల్​ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులను సన్మానించారు.