హైదరాబాద్లో నేడు కరెంట్​ ఉండని ప్రాంతాలివే

ఎల్బీనగర్, వెలుగు : సరూర్ నగర్ డివిజన్ లో గురువారం కరెంట్​సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ కె.కె.రామకృష్ణ తెలిపారు. మన్సూరాబాద్11కేవీ ఫీడర్ పరిధిలోని మన్సూరాబాద్, భవాని నగర్, మధురానగర్, ఆగమయనగర్ కాలనీ, అనితానగర్, మల్లికార్జున నగర్, వివేకానంద నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు కరెంట్​సప్లయ్​ఉండదన్నారు. 

అలాగే సెంట్రల్ బ్యాంక్ కాలనీ, సూర్యోదయకాలనీ, సరస్వతినగర్, మధురానగర్, హకీమబాద్ కాలనీ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం ఒంటి వరకు కరెంట్ ఉండదని, సౌత్ ఎండ్ పార్క్ 11కేవీ ఫీడర్ పరిధిలోని హిమపురి కాలనీ, చండీశ్వరి కాలనీ, శైలజాపురి కాలనీ, మధురానగర్, భవానీనగర్ సమీప ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కరెంట్ ఉండదని చెప్పారు.