ప్రభుత్వ హాస్పిటల్స్ ను అభివృద్ధి చేయాలి

ఆర్మూర్, వెలుగు : ప్రభుత్వ హాస్పిటల్స్ లో  నిరంతరం వైద్యసేవలు అందించే విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని పీవో డబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెమ్మ,  పీవైఎల్​ జిల్లా అధ్యక్షుడు అనీష్   కోరారు. శుక్రవారం ఆర్మూర్​లో  ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ హాస్పిటల్స్​ ను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ పీవైఎల్​, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ హాస్పిటల్స్​లో  సరిపడా సిబ్బంది లేక సామాన్య ప్రజలకు  వైద్యం అందడం లేదన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్​లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.  ప్రైవేటు హాస్పిటల్స్​లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.  కార్యక్రమంలో  నాయకులు జి.పద్మ, ఎన్.లక్ష్మి, బట్టు రవి, మనోజ్, గంగాధర్, శ్రీనివాస్  పాల్గొన్నారు.