సంక్షోభంలో పౌల్ట్రీ రైతు.. సిండికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిన ట్రేడర్లు..

  • గత 20 రోజులుగా నేలచూపులు చూస్తున్న కోళ్ల ధరలు
  • లాభాలు గడిస్తున్నకంపెనీలు, ట్రేడర్లు..ఆర్థికంగా నష్టపోతున్న పౌల్ట్రీ రైతులు
  • కరీంనగర్ జిల్లా కేంద్రంగా అనధికారికంగా డెలివరీ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఓ ట్రేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో పౌల్ట్రీ రైతు నష్టాల్లో కూరుకుపోతున్నాడు. ఈ రంగంలో కోడిపిల్లల (చిక్), దాణా, మెడిసిన్ సరఫరాదారులు, కోళ్లను కొనుగోలు చేసే ట్రేడర్లు, చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాపారులు లాభాలు గడిస్తుండగా.. పౌల్ట్రీ రైతులు మాత్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. గత 20 రోజులుగా కోళ్ల ధరలు నేలచూపులు చూస్తున్నాయి. వెంకాబ్ ఇచ్చే పేపర్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భిన్నంగా ట్రేడర్లు సిండికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారి పౌల్ట్రీ రైతుల దగ్గర తక్కువ రేటుకు కోళ్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో లక్షల్లో ఖర్చు చేసి కోళ్లను పెంచిన రైతులు లబోదిబోమంటున్నారు. మరో వైపు పౌల్ట్రీ రంగంలో విస్తరించిన కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడలేక.. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

పేరుకే పేపర్ రేటు... 

ఈ నెల 15న ఆదివారం వెంకాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్ రేట్ లైవ్ చికెన్ కిలో రూ.101 ఉండగా, కరీంనగర్ జిల్లా కేంద్రంగా సిండికేట్ నడిపిస్తున్న ట్రేడర్ మాత్రం డెలివరీ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.95గా ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. మళ్లీ దానిపై రూ. 8 నుంచి రూ.10 వరకు మైనస్ చేశారు. దీంతో రైతుకు కిలోకు రూ.85 మాత్రమే దక్కింది. అంతకు 15 రోజుల ముందు వరకు ఈ ధర రూ.65 నుంచి రూ.70 మాత్రమే ఇచ్చారు. కానీ బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కిలో చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.200 నుంచి రూ.240 వరకు పలికింది. పౌల్ట్రీ రైతుకు, చికెన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య దళారీగా ఉన్న ట్రేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరిట కిలో మీద రూ.15 నుంచి రూ.20 వరకు దోచేస్తున్నారు. 

మొత్తం ఈ దందాలో కీలకంగా పనిచేస్తున్న ట్రేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. డెలివరీ రేట్ ఫిక్స్ చేసే అధికారం, ధరను మైనస్ చేసే అవకాశం ఎవరిచ్చారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. శనివారం ఒక్క రోజే సుమారు 30 వేల నుంచి 40 వేల కోళ్ల వరకు లిఫ్టింగ్ చేస్తూ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తన గుప్పిట్లో పెట్టుకున్న ఈ ట్రేడర్ కోట్ల రూపాయల చీకటి దందా కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా పౌల్ట్రీ రైతు సదరు ట్రేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ధరల విషయమై ప్రశ్నిస్తే.. ఆ రైతు దగ్గర ఎవరూ కోళ్లు కొనకుండా చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడు చెప్పిన రేటుకే కోళ్లను అమ్మాల్సి వస్తోంది. 

పెరిగిన దాణా, చిక్ ధరలతో ఇబ్బందులు 

ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో చిన్నాచితక వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద వ్యాపారుల వరకు కలిపి సుమారు 80 మంది ట్రేడర్లు ఉండగా, 50 లక్షలకుపైగా కెపాసిటీ గల కోళ్ల షెడ్లు ఉన్నాయి. ఉన్న షెడ్లలో నాలుగో వంతు మాత్రమే కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం వారానికి సుమారు 3 లక్షల కోళ్లను పెంచుతున్నారు. మరికొందరు కంపెనీలకు లీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇచ్చేస్తున్నారు. కోడిపిల్లల (చిక్స్) ధరలు, ఫీడ్ కంపెనీల ధరలు పెరగడం, ట్రేడర్ల అడ్డగోలు దోపిడీతో రైతులు సతమతమవుతున్నారు. 

కొద్ది రోజుల క్రితం ఫీడ్ 50 కేజీలకు రూ. 1,800 ఉండగా ముడి సరుకు (సోయా) ధర పెరిగిందని ప్రస్తుతం రూ. 2,100కు పెంచేశారు. సోయా కిలో ధర రూ.45 నుంచి ప్రస్తుతం రూ.30కి తగ్గినా కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు మాత్రం ఫీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరలను తగ్గించడం లేదు. అలాగే చిక్స్ ధర చాలా రోజులుగా రూ. 40 నుంచి రూ. 44 పైనే ఉంది. చిక్స్ ఉత్పత్తి చేసే కంపెనీలు చాల వరకు సిండికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. 

కార్పొరేట్ కంపెనీల ఇష్టారాజ్యం.. 

రాష్ట్రంలో కోళ్ల ధరలను రెండు ప్రధాన కార్పొరేట్ కంపెనీలు నిర్ణయిస్తుంటాయి. అయితే ఇందులో ఓ కంపెనీ నిర్వాకమే రైతులను తీవ్రంగా నష్టాల్లోకి నెడుతోంది. సదరు కంపెనీ తన ప్రత్యర్థి కంపెనీ అయిన వెంకాబ్ కంటే తక్కువ ధరను పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రకటిస్తూ.. వెంకాబ్ కూడా ధర తగ్గించేలా చేస్తోంది. దీంతో వెంకాబ్ రేటుపై ఆధారపడిన రైతులు తక్కువ ధరకు కోళ్లను అమ్ముకోవాల్సి వస్తోంది. 

దీనికి తోడు ట్రేడర్లు పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్ కంటే తక్కువగా డెలివరీ రేటు ఫిక్స్ చేయడంతో పాటు అందులోనూ మైనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటిస్తున్నారు. దీంతో మార్కెట్లో రైతులు నిలబడలేక అర్థికంగా నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో తాము రోడ్డున పడే ప్రమాదం ఉందని పౌల్ట్రీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా చికెన్ సెంటర్ల  నిర్వాహకులు..

చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ల నిర్వాహకులు సైతం తాము చెప్పిందే ఫైనల్ అనే భావనతో ఎక్కువ ధరలకు చికెన్ అమ్ముతూ అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. రైతు కోడిని అమ్మిన రేటు.. చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లేసరికి రెండింతలవుతోంది. మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికి నచ్చిన విధంగా వారు చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విక్రయిస్తున్నారు. చికెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లలో అధిక ధరలను చూసి పౌల్ట్రీ రైతులకు లాభాలున్నాయనే భావనలో చాలా మంది ఉంటున్నారు. 

నాకు కిలోపై  రూ.29 మైనస్ ఇచ్చారు

ఈ నెల 9న నేను కిలో రూ.100 పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని కోళ్లను అమ్మాను. కానీ తెల్లవారి చూసేసరికి డెలివరీ రేటు రూ.81 అని వచ్చింది. అందులోనూ మరోసారి రూ.10 మైనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. దీంతో నాకు కిలోకు రూ.71 మాత్రమే వచ్చింది. అంటే పేపర్ రేటుతో పోల్చితే కిలోకు రూ.29 చొప్పున నష్టపోయాను. 1,500 కోళ్లు అమ్మగా రూ.90 వేలు నష్టం వాటిల్లింది. మేము పదేండ్లుగా పౌల్ట్రీపై ఆధారపడి జీవిస్తున్నాం. కరీంనగర్ నుంచి వచ్చే అనధికార డెలివరీ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం నియంత్రించి దళారుల భారీ నుంచి మా రైతులను కాపాడాలి.

– బొమ్మ మధు, కలిగోట గ్రామం, జగిత్యాల జిల్లా

కోడి పెంపకం ఖర్చు ఇలా..(రెండు కిలోలకు)

  • కోడి పిల్ల(చిక్) రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.41
  • 3.100 కిలోల ఫీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.130 మెడిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.6
  • లేబర్, విద్యుత్, ఇతరత్రా ఖర్చులు రూ.7 
  • మొత్తం రూ. 184 ఖర్చుతో రెండు కిలోల కోడి పెరుగుతుంది. 
  • కిలోకి రూ.92 చొప్పున ఖర్చు అవుతుంది.