శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలియని వారు ఉండరు. ఈయన సర్వజ్ఞాని, గొప్ప తత్వవేత్త, అపర మేధావి. భవిష్యత్తును ముందే చెప్పగల మహాపండితుడు. రాబోయే కాలంలో జరిగే పరిణామాలను, జరగబోతున్న సంఘటనలను ముందుగానే గ్రహించి చెప్పిన మహా జ్ఞాని. ఈయన చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికే జరిగాయి. కొన్ని జరుగుతున్నాయి, మరికొన్ని జరగబోయే అవకాశం కూడా ఉంది. కాలజ్ఞానిగా పేరు పొందిన ఈయనను పూజించే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. బ్రహ్మాండాన్ని అవపోసన పట్టిన వీరబ్రహ్మేంద్ర స్వామి పలు ప్రాంతాలలో తిరుగుతూ ప్రజలకు కాలజ్ఞానం చెబుతుండేవారు. భవిష్యత్తును చెప్పగల సత్య ప్రవచకులుగా కీర్తి ప్రతిష్టలు పొందారు.
ఇప్పటివరకు జరిగిన ఎన్నో సంఘటనలను స్వామివారు ముందుగానే ఊహించి చెప్పారు. జీవకోటి రాశులలో మానవజన్మ అద్భుతం. అటువంటి మనుషులు కాలజ్ఞానం తెలుసుకొని భయభక్తులు కలిగి జీవితాన్ని తరింప చేసుకోగలరని బ్రహ్మం గారి అభిప్రాయం. కలియుగ అవతార పురుషుడిగా మనుషులకు నీతి మార్గాలను బోధించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. యుగాలు మొత్తం 4.. వాటిలో మొదటిది కృతయుగం. ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. ప్రజలు సత్య మార్గంలో పయనించారు. రెండవది త్రేతాయుగం, ఈ కాలంలో ధర్మం 3 పాదాలతో నడుస్తుంది. మూడవది ద్వాపర యుగం ఉద్యోగంలో ధర్మదేవత రెండు పాదాలతో నడుస్తుంది. ఇక నాలుగవది కలియుగం ఈ యుగంలో ధర్మ దేవత 1 పాదంపై నిలబడాల్సి వచ్చింది. ధర్మానికి విలువ లేకుండా పోయింది.
ధర్మదేవతకు చోటులేకుండా పోయింది. అవినీతి అడ్డు అదుపూ లేకుండా పెరిగిపోయింది. అన్యాయాలు అరాచకాలు అమాంతం పెరిగిపోయాయి. పాప కార్యాల చిట్టా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వీటన్నింటి గురించి వివరంగా తెలిపారు వీరబ్రహ్మేంద్రస్వామి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు తెలియజెప్పి జరగబోయే ప్రమాదం అని ముందుగానే హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ మార్గం చూపారు. అక్షరాలా వీరబ్రహ్మేంద్ర స్వామి తన ప్రియ శిష్యుడైన సిద్దయ్యను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలను సంచరిస్తూ 175 సంవత్సరాలు భూమిపై సంచరించి, మానవులకు భక్తి జ్ఞాన వైరాగ్యాలను కాలజ్ఞానం వినిపించిన మహర్షి వీరబ్రహ్మేంద్ర స్వామి. కలియుగంలో ప్రస్తుతం ప్రథమ పాదం జరుగుతోంది. బ్రహ్మంగారు చెప్పిన ప్రతి మాట వేదవాక్కు లాంటిది. మానవుల శక్తికి... మేధస్సుకి హద్దులు ఉండవు అని ఆయనే అన్నారు. ఇలా ఎన్నో విషయాలను కాలజ్ఞానం లో పొందుపరిచారు.