ఇంట్లో పెంచుకునే ఒక మొక్కకు కేన్సర్ కారక కాలుష్యాలను తరమికొట్టే శక్తి ఉందట. 'పోతోస్' అనే ఈ మొక్కను జన్యుపరంగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా కేన్సర్ విస్తరిస్తోంది. జంకుడ్స్ తీసుకోవడం, పొగ తాగడం, గుట్కా, పాన్ మసాలాలు నమలడం వల్లే కాదు.. ఇల్లు, ఇంటి పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నా...గాల్లో ఉండే కొన్ని మాలిక్యూల్స్ వల్ల కూడా కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. క్లోరోఫాం, బెంజీన్ మాలిక్యూల్స్ ఆ కోవలోవే!
అయితే, జన్యుపరంగా అభివృద్ధి చేసిన పోతోస్ మొక్క ఇలాంటి మాలిక్యూల్స్ ని తొలగిస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్లోరోఫాం, బెంజీన్... లాంటి ఇతర కాలుష్య కారకాలను ఈ మొక్కలు పీల్చుకొని తమ ఎదుగుదల కోసం ఉపయోగించుకుంటుందట.
అంతేకాకుండా 2-ఈవన్ ప్రొటీన్ ను గాల్లోకి విడుదల చేస్తాయట. అయితే, మనిషి శరీరంలో ఉండే 2 ఈవన్... బెంజిన్ ను ఫినాల్లోనూ, క్లోరోఫాంను కార్బన్ డయాక్సైడ్ గానూ మార్చుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మనిషి శరీరంలో చోటుచేసుకునే ఈ ప్రక్రియను బయట మొక్కల్లోనూ జరపాలని నిర్ణయించి.. సక్సెస్ అయ్యామంటున్నారు.