విలీన సభ పోస్టర్ ఆవిష్కరణ

నవీపేట్, వెలుగు: ఈనెల 20న జరిగే విలీన సభ ను విజయవంతం చేయాలని కోరుతూ ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఐఎఫ్ టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఈ నెల 20న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన న్ భవన్ లో జరిగే టీయూసీఐలో ఐఎఫ్ టీయూ జరిగే విలీన సభలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్మిక వర్గాలపై జరిగే దాడులను అరికట్టాలని, ప్రపంచీకరణను, ప్రవేటీకరణను ఆపాలన్నారు. కార్యక్రమంలో దేవన్న, రాములు, సాయిలు, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.