యాపిల్ ఫోన్​, వాచ్​, ఇయర్​బడ్స్​ని ఒకేసారి చార్జ్​ చేసుకోవచ్చు.. దీని రేటెంతంటే..

యాపిల్​ ప్రొడక్ట్స్ వాడేవాళ్లకు ఇది బెస్ట్ గాడ్జెట్​. దీంతో యాపిల్ ఫోన్​, వాచ్​, ఇయర్​బడ్స్​ని ఒకేసారి చార్జ్​ చేసుకోవచ్చు. దీన్ని పోర్ట్‌‌‌‌రోనిక్స్ కంపెనీ ‘ఫ్రీడమ్ ఫోల్డ్–3’ పేరుతో తీసుకొచ్చింది. ఇది చార్జర్​లా మాత్రమే కాకుండా ఫోన్​ స్టాండ్​లా కూడా పనిచేస్తుంది. 15-వాట్స్​ వరకు వైర్‌‌‌‌లెస్ అవుట్‌‌‌‌పుట్‌‌‌‌ ఇస్తుంది. ఇయర్​ బడ్స్​, వాచ్​ లాంటివి చార్జ్​ చేసినప్పుడు వాటి సపోర్ట్​ని బట్టి 12, 10, 7.5, 5, 2.5 వాట్స్​కి తగ్గించి కూడా సప్లై చేస్తుంది. 

ఐఫోన్​ 12తోపాటు ఆ తర్వాత వచ్చిన అన్ని మోడల్స్​కి సపోర్ట్​ చేస్తుంది. ఐఫోన్​14ని గంటలో 40 శాతం చార్జ్ చేయగలదు. ఈ చార్జింగ్ స్టాండ్​ని హై క్వాలిటీ  పీయూ లెదర్‌‌‌‌తో తయారు చేశారు. మన్నికగా ఉండడంతోపాటు లుక్​ కూడా బాగుంటుంది. నాన్ స్లిప్ డిజైన్ వల్ల చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్‌‌‌‌ సేఫ్​గా ఉంటుంది. దీని బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే. దీన్ని బ్యాగ్, ప్యాకెట్​లో కూడా పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. 

ధర : రూ. 1,617