Pooja Hegde: వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న పూజా హెగ్డే.. గ్యాప్ వచ్చిన రెమ్యునరేషన్లో తగ్గేదేలే!

ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటి పూజా హెగ్డే (Pooja Hegde). 2012 తమిళ మూవీ ముగమూడితో సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా మారి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. కెరీర్ మొదట్లోనే అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో జోడీగా నటించి తెలుగు ఫ్యాన్స్లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది.

అయితే కొన్నాళ్లుగా ఈ అమ్మడికి అవకాశాలు అంతగా కలిసిరాలేదు. ఆమె ఏ మూవీ చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో పూజా హెగ్డే కెరీర్ ముగిసినట్టే అనుకున్నారంతా. అంతేకాదు తనతో సినిమాలు చేస్తే.. ఫెయిల్ అవ్వడం పక్కా అని కూడా అన్నారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ చేసేసింది ఈ బుట్టబొమ్మ. 

ప్రస్తుతం ఈ అమ్మడికి కాలం కలిసి వస్తోంది. వరుస పాన్ ఇండియా సినిమాల ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఐదు బడా మూవీస్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోలీవుడ్ స్టార్ సూర్య44 మూవీలో నటిస్తోంది.

అలాగే దళపతి విజయ్69 మూవీలో కూడా చాన్స్ కొట్టేసింది. ఇక బాలీవుడ్ షాహిద్ కపూర్ హీరోగా దేవ మూవీలో కూడా నటించనుంది. ఈ సినిమా తరువాత నిర్మాత సురేష్ బాబు, పూజ హెగ్డేతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది వుమెన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఇది అయ్యాక ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి ఒక కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు, ఆ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేని తీసుకున్నట్లు 
సమాచారం. 

అయితే, ఈ ఆఫర్లతోనైనా తన కెరీర్ మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి. కాగా తన వరుస ఫెయిల్యూర్స్ పై వస్తోన్న విమర్శలపై పూజా మాట్లాడుడూ.. "ఫెయిల్యూర్ వల్ల ఎప్పుడూ బాధపడలేదు. మంచి సమయం కోసం ఓపిగ్గా ఎదురుచూశాను. భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందనే నమ్మకం ఉంది' అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

కాగా ఇన్నాళ్లు పూజా హెగ్డే సినిమా ఛాన్సులు లేకపోయినా.. రెమ్యునరేషన్లో గ్యాప్ రాలేదనేలా తీసుకుంటుందట. ప్రస్తుతం ఈ బ్యూటీ  అక్షరాలా రూ. 4 కోట్ల రూపాయలు తీసుకుంటోందని టాక్. ఆమె గత చిత్రాలకు రూ. 3.5 కోట్లు వసూలు చేయగా.. ఇపుడు రూ. 4 కోట్ల వరకు చేరింది. రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అని చెప్తోంది పూజా హెగ్డే.!

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)