మేం ఎవ్వరిని జైల్లో పెడతామని అంటలేం : పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌

  • కానీ, తప్పు చేసినోళ్లపై కచ్చితంగా చర్యలు ఉంటయ్​: పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌
  • సిరిసిల్ల జిల్లాలో నేతన్నల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్ట పరిధిలో జరిగిన తప్పులకు కచ్చితంగా చర్యలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ‘‘మేం ఎవ్వరినీ జైల్లో పెడతామని అనడం లేదు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వంలో కొంత మంది నాయకులు వాళ్లను జైల్లో పెడతాం.. వీళ్లను జైల్లో పెడతాం అన్నారు. కానీ, తాము అలా అనడం లేదు”అని పేర్కొన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పొన్నం పాల్గొని, మాట్లాడారు.

‘‘వికారాబాద్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌పై జరిగిన దాడిలో గిరిజన రైతులు, సామాన్యులు ఉన్నారని కొంతమంది చెబుతున్నారు. వారికి కలెక్టర్‌‌‌‌‌‌‌‌పై దాడి చేసేంత ధైర్యం ఉంటుందా. దాడి చేసిన సురేశ్‌‌‌‌ మా పార్టీ కార్యకర్తే అని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఒప్పుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేస్తున్నాయి. కలెక్టర్‌‌‌‌‌‌‌‌పై దాడి చేసిన, చేయించిన వారిపై చర్యలు ఉంటాయి”అని పేర్కొన్నారు. మరోవైపు, ఫార్ములా ఈ– కార్ రేసు కేసుకు సంబంధించిన విచారణ కూడా జరుగుతోందని చెప్పారు. ఈ ఘటనలకు సంబంధించి తమను జైల్లో వేస్తారేమోనని కొంతమంది సింపతి పొందటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసలు కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి అర్హుడా? అని పొన్నం ప్రశ్నించారు. 

నేతన్నల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తాం.. 

సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని మంత్రి పొన్నం కోరారు. నేతన్నల సమస్యల కోసం సిరిసిల్లలో ఒక రోజు గ్రీవెన్స్ సెల్ పెడతామని, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. జీవో నంబర్‌‌‌‌‌‌‌‌ 1 ద్వారా నేతన్నలు ఉత్పత్తి చేసిన క్లాత్‌‌‌‌ను టెస్కో ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలను కూడా రీలీజ్ చేస్తున్నామన్నారు.

బతుకమ్మ చీరలకు బదులుగా మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ఆర్డర్లు త్వరలో ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నేతన్నలకు ఉపాధి కల్పించి ఉంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వారికి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపునకు కార్యకర్తలు పని చేయాలని సూచించారు. నాగుల సత్యనారాయణ గౌడ్ సీనియర్ నాయకుడు అని, ఆయనకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి తక్కవే.. అయినా భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని చెప్పారు. 

జిల్లా అబివృద్ధి ఎక్కడా ఆగదు: విప్ ఆది శ్రీనివాస్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి నిలిచిపోతుందని కొంతమంది అన్నారని, అయితే జిల్లాలో ఎక్కడా అభివృద్ధి ఆగదని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నామినేటేడ్ పదవులు ఇస్తామని చెప్పారు. సిరిసిల్లలో 30 ఏండ్ల నేతన్నల కల త్వరలో నేరవేరబోతోందని తెలిపారు. రూ.50 కోట్లతో సిరిసిల్లకు మంజూరైన నూలు డిపో త్వరలో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ప్రారంభించనున్నారని చెప్పారు.