లోటు బడ్జెట్‌‌‌‌లో ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తాం :  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

  • ప్రభుత్వం తరఫున త్వరలోనే గుడ్‌‌‌‌ న్యూస్‌‌‌‌
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

కూసుమంచి, వెలుగు : రాష్ట్రం లోటు బడ్జెట్‌‌‌‌లో ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చెప్పారు. రైతులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో  సీసీ రోడ్డు పనులకు ఎంపీ రఘరాంరెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున రైతులకు త్వరలోనే తీపికబురు అందుతుందని చెప్పారు.

ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది అప్లై చేసుకున్నారని, యాప్‌‌‌‌ ద్వారా ఇప్పటికే 30 లక్షల మంది సర్వే పూర్తి చేశామని చెప్పారు. పూర్తయిన డబుల్‌‌‌‌ ఇండ్లను పంపిణీ చేస్తూ, పెండింగ్‌‌‌‌లో ఉన్న వాటిని కూడా మంజూరు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి రెండో ఏడాది అయినందున అభివృద్ధి మీద, ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టామన్నారు.

అనంతరం కూసుమంచి, నేలకొండపల్లి మండలానికి చెందిన పలువురికి క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో సీఎంఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ ఎస్‌‌‌‌ఈ హేమలత, ఇరిగేషన్‌‌‌‌ ఎస్‌‌‌‌ఈ వెంకటేశ్వరరావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పీఆర్‌‌‌‌ ఈఈ వెంకట్‌‌‌‌రెడ్డి, డివిజనల్‌‌‌‌ పంచాయతీ ఆఫీసర్‌‌‌‌ రాంబాబు, వ్యవసాయ శాఖ అసిస్టెండ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ సరిత, కూసుమంచి ఎంపీడీవో వేణుగోపాల్‌‌‌‌రెడ్డి, ఇన్‌‌‌‌చార్జి తహసీల్దార్‌‌‌‌ కరుణశ్రీ పాల్గొన్నారు.