V6 Special : మన దేశంలోనే.. ఈ నగరాల్లో అస్సలు పొల్యూషన్ లేదు.. ఇక్కడ గాలి అమృతం..!

సిటీ అంటే అమ్మో పొల్యూషన్ అనే స్థాయికి వచ్చేసింది.. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ అయితే ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం ఉన్న సిటీగా గుర్తింపు తెచ్చుకున్నది. ఢిల్లీ జనం పీల్చేది గాలి కాదు.. విషం అంటున్నారు నిపుణులు. అంతేనా.. ఢిల్లీలో బతికే జనం ఆయుష్షు అక్షరాల ఆరు.. 6 సంవత్సరాలు తగ్గిపోతుందంట.. పొల్యూషన్ పీల్చటం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో లక్షల మంది చనిపోతున్నట్లు చెబుతున్నారు నిపుణులు.

ఒక్క ఢిల్లీనే కాదు.. ఇప్పుడు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి సిటీల్లోనూ పొల్యూషన్ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. మరి ఇలాంటి సమయాల్లో.. పొల్యూషన్ ఫ్రీ సిటీస్ కూడా ఉన్నాయి.. అదీ మన భారతదేశంలోనే.. మన దేశంలోని ఈ నగరాల్లో అస్సలు పొల్యూషన్ ఉండదు.. పొల్యూషన్ ఫ్రీ సిటీస్ అన్నమాట.. ఆ నగరాలు ఏంటో వివరంగా తెలుసుకుందామా...

 దేశరాజధాని ఢిల్లీ అంటే అందరికి గుర్తొచ్చేది.. పీఎంఓ కార్యాయలం.. రాష్ట్రపతి భవనం... ఇండియా గేట్​.. ఇప్పుడు వీటితో పాటు మరో భయంకరమైన వాతావరణం కూడా గుర్తొస్తుంది.  ఢిల్లీ ప్రజలను ఎయిర్​ పొల్యూషన్​ చిత్రహింసలు పెడుతుంది. ఢిల్లీలో కాలుష్యం మితిమీరింది.  అలాగని అన్ని సిటీలు ఒకేలా ఉంటాయనుకుంటే పొరపాటే. మనదేశంలో పొల్యూషన్ లేని ప్రశాంతమైన సిటీలు కూడా కొన్ని ఉన్నాయి. సిటీలో ఉండే అన్ని సౌకర్యాలు ఉంటూనే.. అందంగా, కాలుష్యం లేని ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటాయి.  

సిటీ అంటే ముందు గుర్తొచ్చేది పాపులేషన్, పొల్యూషన్, కాంక్రీట్ బిల్డింగ్స్, ఎక్కడ చూసినా రద్దీ... అందుకే ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్లు సిటీకి దూరంగా ప్రశాంతమైన మారుమూల ప్రాంతాలకు వెళ్తుంటారు.  ఢిల్లీలో కాలుష్యం మళ్లీ ప్రమాదకరస్థాయికి చేరింది. స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. కాలుష్యం మితిమీరిన కారణంగా ప్రాథమిక పాఠశాలలన్నింటినీ మూసివేస్తున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా ఆన్‌లైన్‌లోనే తరగతులు నడుస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ ఎక్స్‌లో వెల్లడించారు. వాయు నాణ్యత సూచీ ఏక్యూఐ వరుసగా  అత్యంత ప్రమాదకర స్థాయిలో 400 మార్కు దాటడంతో ఢిల్లీ-ఎన్సీఆర్‌ పరిధిలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ, కూల్చివేత పనులను నిలిపివేశారు. బీఎస్‌-3 పెట్రోల్‌, బీఎస్‌-4 డీజిల్‌ వాహనాలను రోడ్లపైకి అనుమతించరు. తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే సుమారు 350 విమానాలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను జైపూర్‌, లక్నో తదితర నగరాలకు దారి మళ్లించారు. ఢిల్లీకి వచ్చే రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి.

పుదుచ్చేరి

పుదుచ్చేరి చెన్నైకి దగ్గర్లో ఉంటుంది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడ టెక్నికల్ డెవలప్ మెంట్ తో పాటు కల్చరల్ హెరిటేజ్ కూడా కనిపిస్తుంది. పుదుచ్చేరిలోని రోడ్లన్నీ చెట్లతో కప్పేసి ఉంటాయి. అందుకే ఎంత ట్రాఫిక్ ఉన్నా ఇక్కడ పొల్యూషన్ ఎఫెక్ట్ అంతగా ఉండదు. పుదుచ్చేరిలోని స్పిరిచ్యువల్. ఆర్టిస్టిక్ కల్చర్ సిటీని ఇంటర్నేషనల్ ప్లేస్ గా తీర్చిదిద్దింది. ఇక్కడ పలు రకాల జాతుల వాళ్లు నివసిస్తుంటారు. ఇక్కడుండే స్వచ్ఛమైన గాలి, కలుషితం కాని నీళ్లు ప్రశాంతమైన అనుభూతినిస్తాయి. 

అందుకే ఇక్కడుంటే.. సిటీలో ఉన్నామన్న ఫిలింగే రాదు. మన దేశంలో అత్యంత తక్కువ పొల్యూషన్ ఉండి, మంచి అర్బన్ డెవలప్ మెంట్ ఉన్న సిటీల్లో పుదుర్చేరి ఒకటి. పుదుచ్చేరిలో విజిట్ చేయాల్సిన ప్లేసులు కూడా చాలా ఉన్నాయి. ఆరోవిల్, పుదుచ్చేరి బీడ్ లాంటివి ఇక్కడుండే వాళ్లకు వీకెండ్ ఎంజాయిమెంట్​ ప్లేసెస్, సిటీ టూరిజంను ఇష్టపడే వాళ్లకు మంచి ఆప్షన్ ఇది.

కిన్నాపూర్​ (హిమాచల్​ ప్రదేశ్​)

కిన్నాపూర్​ హిమాచల్​ ప్రదేశ్​ లో ఉంది.  మనదేశంలో స్వచ్చమైన గాలి దొరికే ప్రదేశంలో కిన్నాపూర్​ ఒకటి,  ఈ ప్రదేశానికి టూరిస్టుల తాకిడి కూడా తక్కువే.  అందుకే  అత్యంత తక్కువ పొల్యూషన్ తో  ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ యాపిల్స్ బిజినెస్ బాగా జరుగుతుంది. కిన్నాపూర్ యాపిల్స్ దేశమంతా పాపులర్, యాపిల్స్ ఎక్స్ పోర్ట్ తో సిటీ అంతా బిజీగా ఉంటుంది. చుట్టూ దట్టమైన చెట్లు, కొండ ప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్య కూడా అంతగా ఉండదు. కొద్దిపాటి గాలి కలుషితమై ఉన్నా అగాలిని చెట్లు పీల్చేసుకుంటాయి. ఇకపోతే ఇక్కడ సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అన్న మాటే ఉండదు. 

హిమాలయాల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటినే ఇక్కడి వాళ్లు తాగుతారు. సిటీ లైఫ్ స్టైల్, గజిబిజిలేని ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వాళ్లకు ఇది బెస్ట్​ ప్లేస్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కు కూడా ఇది ఫేమస్ . మనాలికి  వెళ్లాలనుకునే వాళ్లు దానికి బదులు కిన్నాపూర్ వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు.

కొల్లాం ( కేరళ)

 కాలుష్యం మచ్చు కైనా కనబడని మరో సిటీ కేరళలోని కొల్లాం. ఇక్కడ కేరళ ఇందాలతో పాటు సిటీ లైఫ్ స్టైలే కూడా కనిపిస్తుంది. ఈ సిటీలో ఎక్కడ చూసినా పార్కులు, సరస్సులు కనిపిస్తాయి. సరస్సుల చుట్టూ కొబ్బరిచెట్లు, జీడి తోటలు కనిపిస్తాయి. అందుకే ఇక్కడి గాలిలో కాలుష్యం చాలా తక్కువ నీళ్లు కూడా స్వచ్చంగా ఉంటాయి. ఇక్కడ ఉండే పోర్ట్, బీచ్​ లు  చూడదగ్గ ప్రదేశాలు.

హసన్​ ( కర్నాటక)

కర్నాటకలోని హసన్​ లో  తక్కువ పొల్యూషన్ ఉంటుంది. హసన్ పొల్యూషన్ లేని సిటీగా మాత్రమే కాకుండా చాలా అందమైన సిటీల్లో కూడా ఒకటి. ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చదనమే పలకరిస్తుంది. మనదేశంలోనే అతితక్కువ కాలుష్యం ఉన్న నగరాలో హసన్ ఒకటి అని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది.

చండీఘడ్​

మన దేశంలో ప్లాన్ చేసి కట్టిన సిటీల్లో చండీగడ్​ మొదటిది. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిన సిటీ ఇది. చండీగడ్​ అభివృద్ధి చెందిన సిటీతో పాటు పొల్యూషన్ ఫ్రీ సిటీ కూడా. పర్యావరణ ప్రేమికులకు ఈ సిటీ ఎంతగానో నచ్చుతుంది. ఇక్కడ పార్కులు, రిట్రీట్ లు బాగుంటాయి. పచ్చదనం కూడా ఎక్కువే...  అందుకే ఇక్కడ కాలుష్యం చాలా తక్కువ.. కాలుష్యం పెరగకుండా ఇక్కడ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ లేకుండా వాహనాల రద్దీ పెరిగి వాయుకాలుష్యం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాదు. చండీగడ్​ లో  చెత్తతో తయారు చేసిన రాక్ గార్డెన్ పార్క్ కూడా ఉంది.

మధురై (తమిళనాడు)

తమిళనాడులోని మధురైని ఏథెన్స్ ఆఫ్ ఈస్ట్ అంటారు. ఇది మనదేశంలోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటి కాలుష్యరహిత నగరంగా డబ్ల్యూహెచ్ ఓ దీన్ని గుర్తించింది. ఈ నగరం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. సిటీ కల్చర్ పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది. ఇక్కడ కాలుష్యం పెరగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉంటుంది. సిటీలో పార్కులు, గార్డెన్లతోపాటు ఖాళీ ఉన్న ప్రతీ చోట మొక్కలు నాటారు. ఇక్కడి నీరు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. శబ్ద కాలుష్యం  కూడా తక్కువే.

గ్యాంగ్ టక్ (సిక్కిం)

సిక్కింలోని గ్యాంగ్ టక్ హిమాలయాల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇక్కడే కాలుష్యమనే మాటే ఉండదు. హిమాలయాల బందాలు, ప్రకృతి దృశ్యాలతో పాటు అన్నిరకాల సిటీ సౌకర్యాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. హిమాలయాల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలులు ఈ ప్రదేశాన్ని ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంచుతాయి. ఇక్కడుండే బౌద్ధారామాలు, వాధులా పాస్, పోంగో లే చూడదగ్గ ప్రదేశాలు.

–వెలుగు, వీ 6 .. ప్రత్యేక కథనం‌‌–