వలిగొండ మండలంలో 240 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యం పట్టివేత

యాదాద్రి, వెలుగు : రైస్ మిల్లులో భారీగా పీడీఎస్ బియ్యం దొరికాయి. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకకు చెందిన పంతంగి రాజుకు రైస్ మిల్లులో చుట్టు పక్కల గ్రామాల నుంచి పీడీఎస్​రైస్ తక్కువ రేటుకు కొని స్టోర్​చేస్తున్నాడు.  సివిల్​సప్లయ్​డిపార్ట్​మెంట్​కు చెందిన కొందరి అధికారుల అండతో రాజు  పీడీఎస్​ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాడు. 

ఈనెల 1 నుంచి రేషన్​షాపుల్లో ఇస్తున్న పీడీఎస్​ బియ్యాన్ని పలువురు వద్ద రాజు కొనుగోలు చేసి తన రైస్ మిల్లులో దాచాడు. బ్యాగుల్లో ప్యాక్ చేసి లారీలో (ఏపీ 22, డబ్ల్యూ-9699) లోడ్​చేస్తుండగా సమాచారం అందడంతో  మంగళవారం పోలీసులు దాడి చేసి 240 క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని రాజుపై కేసు నమోదు చేశారు.