ఆటోలో నగల బ్యాగ్ మర్చిపోయిన మహిళ..తిరిగి అందజేసిన పోలీసులు

  • ఆటో డ్రైవర్ నుంచి స్వాధీనం చేసుకున్న కరీంనగర్ పోలీసులు 
  • బాధిత మహిళకు తిరిగి అందజేత  

కరీంనగర్ క్రైం, వెలుగు : ఆటోలో వెళ్తూ మహిళ బంగారు నగల బ్యాగును మర్చిపోవడంతో పోలీసులు తిరిగి అప్పగించిన ఘటన కరీంనగర్ లో జరిగింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన మామిడిపల్లి గణేశ్, హేమశ్రీ దంపతులు బుధవారం కరీంనగర్ లోని ఒక పెండ్లికి వెళ్లారు. తిరిగి సొంతూరు వెళ్లేందుకు ఫంక్షన్ హాలు వద్ద ఆటో ఎక్కారు.  బస్టాండ్ లోకి వెళ్లిన మహిళ కొద్దిసేపటికి చూసుకోగా తన హ్యాండ్ బ్యాగ్ కనిపించ లేదు. ఆటోలో మర్చిపోగా.. అందులో10 తులాల బంగారు నగలు  ఉండగా.. 

వెంటనే  కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన ఇన్ స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ సిబ్బందిని అలర్ట్ చేశారు.  రెండు టీమ్ లతో గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఆధారంగా ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ ను పట్టుకుని ఆభరణాలను స్వాధీనం చేసుకుని,  గురువారం బాధిత మహిళకు  కరీంనగర్ అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ అందజేశారు.