చైనా మాంజా అమ్మకాలపై స్పెషల్ డ్రైవ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నిషేధిత చైనా మాంజా అమ్మకాలపై కొత్తగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్​ అధికారులు గురువారం స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. పట్టణంలోని పెద్ద బజార్, చిన్న బజార్లతో పాటు పలు ప్రాంతాల్లో పతంగులు అమ్మే షాపులపై తనిఖీలు నిర్వహించారు. చైనా మంజా అమ్మకాలు సాగిస్తున్న షాపుల వద్ద నుంచి మాంజా 30 బండిల్స్​, థ్రెడ్​ రోల్స్​ 10 ప్యాకెట్లు, 14 బండిల్స్​ మంజాను స్వాధీనం చేసుకొని సీజ్​ చేసినట్టుగా డీఎస్పీ రెహమాన్​ తెలిపారు. పట్టుకున్న మంజా విలువ రూ. 9,100 ఉంటుందన్నారు. ఇద్దరిపై  కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో కొత్తగూడెం త్రీ టౌన్​ సీఐ శివ ప్రసాద్, ఎస్సైలు పురుషోత్తం, జి. మస్తాన్​, పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు. 

చండ్రుగొండలో తనిఖీలు..

చండ్రుగొండ : చండ్రుగొండ లోని మెయిన్ సెంటరులో పతంగులు విక్రయించే పలు షాపులను ఎస్సై శివరామకృష్ణ తనిఖీ చేశారు. నిషేధిత మంజా అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.