స్పోర్ట్స్​ మీట్​ ప్రారంభం

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ కమిషనరేట్​పోలీస్ శిక్షణా కేంద్రంలో  స్పోర్ట్స్ మీట్ ను ఇన్​చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ మంగళవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. పోలీసుల విధి నిర్వహణలో క్రీడలు చాలా అవసరమన్నారు. క్రీడల కోసం  కొంత సమయం కేటాయించాలని సూచించారు. 

కేంద్రంలో శిక్షణ పొందుతున్న సిబ్బందిలో  క్రీడాకారులు ఉన్నారని, వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా   కృషి చేయాలన్నారు, ప్రస్తుతం 250 మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలిపారు.  కార్యక్రమంలో అదనపు డీసీపీలు కోటేశ్వరరావు, జి. బస్వారెడ్డి, సీటీసీ ఏసీపీ  మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఎస్. శ్రీనివాస్ రావు, ఏఆర్ ఏసీపీ నాగయ్య, బోధన్ ఏసీపీ  శ్రీనివాస్, సీఐ శివరాం, ఆర్ఐ శ్రీపాల్,  రిజర్వు ఇన్స్​పెక్టర్లు, ఆర్ఎస్​ఐలు,  క్రీడాకారులు పాల్గొన్నారు.