స్నీఫర్ డాగ్స్ తో పోలీసులు విస్తృత తనిఖీలు... ఎక్కడంటే

ములుగు జిల్లాలో స్నీఫర్ డాగ్స్ తో  పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు.  కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా యూత్ అదుపు తప్పకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  గంజాయి రవాణాపై నిఘా ఉంచిన పోలీసులు మత్తు పదార్థాలు, గంజాయి విక్రయాలపై దృష్టి సారించారు.  ఈ రోజు ( డిసెంబర్ 31) అర్దరాత్రి 12.30 గంటల వరకు మాత్రమే న్యూ ఇయర్ వేడుకలు జరుసుకోవాలని సూచించారు.  ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపు కోవాలని పోలీసులు తెలిపారు.  గంజాయి అమ్మినా, సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, మత్తు పదార్థాలను పసిగట్టే స్నిఫర్ డాగ్స్ తో జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు.  వ్యాపార సముదాయాలు, బస్టాండ్లలో పోలీసుల నిఘా ఉంటుందన్నారు.