కామారెడ్డి జిల్లాలో వడ్లు పక్కదారి పట్టించిన.. రైస్ మిల్లు ఓనర్ పై కేసు

కామారెడ్డి, వెలుగు: రైస్ మిల్లు ఓనర్ పై కేసు నమోదైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.  జుక్కల్​ మండలం వజ్రకండి శివారులోని పరమేశ్వర రైస్ మిల్లులో మంగళవారం సివిల్​ సప్లయ్​ ఎన్​ఫోర్స్ ​అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండేండ్లుగా  సీఎంఆర్ రికార్డులు పరిశీలించారు. 21,583 క్వింటాళ్ల వడ్లు తేడా వచ్చినట్టు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో పరమేశ్వర మిల్లు ఓనర్ పై కేసు నమోదు చేసినట్లు జుక్కల్​ఎస్ఐ భువనేశ్వర్​తెలిపారు.