పెద్దపల్లిలో క్షుద్రపూజలు.. ఆరుగురు అరెస్ట్...

పెద్దపల్లి జిల్లా క్షుద్రపూజలు కలకలం రేపింది. క్షుద్రపూజలు చేస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందపల్లి SRSP కెనాల్ దగ్గర అర్ధరాత్రి కొందరు ఖాళీ స్థలంలో ఓ గుడిసె వేసి గొయ్యి తవ్వారు. తెల్లవారు జామున అటుగా వచ్చిన స్థానికులు గమనించారు. గొయ్యి తవ్విన ప్రాంతంలో పసుపు,కుంకుమ,నిమ్మకాయలు,గడ్డపారలను చూసి భయాందోళనలకు గురయ్యారు.పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గుప్త నిధుల కోసం ఇలా చేశారని స్థానికులు ఆరోపించారు. అయితే గుప్త నిధుల కోసమా లేక... అమాయకపు ప్రజల బలహీనతను అడ్డం పెట్టుకుని క్షుద్రపూజల పేరు సొమ్ము చేసుకుంటున్నారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.