ఇక ఆటాడుదాం : పోకీమాన్ మళ్లీ వచ్చేస్తుందా.. ! : దివాళీకి రీ ఎంట్రీ అంట..

పోకీమాన్ మళ్లీ వచ్చేస్తుంది.. దీపావళి సీజన్ దగ్గర పడుతుండగా.. గేమ్ డెవెలపర్ నియాంటిక్ గురువారం ( అక్టోబర్26) పోకీ మాన్ గో ఫెస్టివల్ ఆప్ లైట్స్ మూడో ఎడిషన్ ను ప్రకటించింది. ఇది భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోకీమాన్ ట్రైనర్స్ కోసం నవంబర్ 7 వరకు  ప్రత్యక్ష ప్రసారం చేయబడుతోంది. 

నవంబర్ 7 ఉదయం 10 గంటల నుంచి 12 రాత్రి 8 గంటల వరకు భారతీయ ట్రైనర్ల కోసం పోకీమాన్ గో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ మూడో ఎడిషన్ కొనసాగుతుంది. గ్లోయింగ్ పోకీమాన్, యానిమేటెడ్ పోజిషన్స్ , టాడ్ బల్బ్ ఎన్ కౌంటర్స్, కలెక్షన్ ఛాలెంజెస్ తో దీపావళిని ఎంజాయ్ చేయొచ్చు. 

ఈ ఏడాది హిందీ భాషలో పోకీమాన్ అందుబాటులో ఉంటుంది. భారత్ లో పెరుగుతున్న గేమింగ్ అభిమానుల, విభిన్న సంస్క్రతిని భారతీయ కమ్యూనిటీలను ప్రోత్సహించేందుకు ఉత్తేజకరమైన యాక్టివిటీలు చేస్తోంది.  అంతేకాకుండా Tabdulb, Ele Tadpole Pokemeon కూడా ఈ ఈవెంట్ ఆరంగేట్రం చేస్తుందని కంపెనీ తెలిపింది. 

గత నెలలో పోకీమాన్ కంపెనీ నియాంటిక్ తో కలిసి దేశంలో తన మొబైల్ గేమింగ్ అప్లికేషన్ Pokemon GO ను హిందీలో విడుదల చేసింది. పోకీమాన్ కంపెనీ అభిమానులకు పోకీమాన్ ను మరింత దగ్గర చేసేందుకు 800 పోకీమాన్ ల పేరు మార్చడం ద్వారా భారత దేశ మార్కెట్ లో తన నిబద్ధతను బలోపేతం చేయాలని నిర్ణయించింది. 

ALSO READ :- ఏపీ మంత్రి అంబటి రాంబాబు కారుపై పడిన గోధుమ బస్తాలు.. తప్పిన ప్రమాదం