ఆర్మూర్ సిద్ధులగుట్ట శివరాత్రి ఉత్సవ కమిటీ ఏర్పాటు : పొద్దుటూరి వినయ్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టపై శివరాత్రి వేడుకలు నిర్వహించేందుకు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్​ టౌన్ ​ప్రెసిడెంట్​ సాయిబాబా గౌడ్​తో కలిసి గురువారం గుట్టపై ఉత్సవ నిర్వహణ కమిటీని ప్రకటించారు. కమిటీ ప్రతినిధులుగా భారత్ గ్యాస్ సుమన్, పీసీ గంగారెడ్డి, కోడిగెల మల్లయ్య, గంగాదేవి రైస్ మిల్ ఓనర్​ సూరజ్ గుప్తా, కొంతం మంజుల, ప్రశాంత్ గౌడ్, జిమ్మి సంధ్య, హజారి సతీశ్,  శ్రీనివాస్ చెందేషి, అలిశెట్టి నరేశ్, పొద్దుటూరి చరణ్ రెడ్డి, బట్టు శంకర్  ఎంపికయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల రవి, చిట్టి, చిలుక రాజు, భూపేందర్, శ్యామ్, ప్రసాద్ పాల్గొన్నారు.

Also read : మిషన్ భగీరథ ఫెయిల్యూర్ పథకం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

నిధుల మంజూరుకు సహకరిస్తా..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరయ్యేలా చూస్తానని కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆర్మూర్ మండలంలోని చేపూర్, కోమన్ పల్లి, ఫత్తేపూర్ గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.