30 పడకల పీహెచ్ సీ భవనానికి శంకుస్థాపన

వర్ని, వెలుగు :  వైద్య సేవల్లో బాన్సువాడ  ముందుందని అని  రాష్ట్ర వ్యవసాయ సలహాదారు  పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం చందూర్ మండల కేంద్రం లో రూ. 1.43 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 30 పడకల పీహెచ్ సీ భవనానికి శంకుస్థాపన. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ సమాజంలో 90 శాతం మంది ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్స్​లో వైద్య సేవలు పొందుతున్నారన్నారు.  ప్రతి జిల్లా కేంద్రంలో నూతన ప్రభుత్వ హాస్పిటల్ లో ఐసీయూ బెడ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అత్యాధునిక వైద్య పరికరాలతో హాస్పిటల్స్ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తోందన్నారు.  ముప్పనేని సుబ్బారావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు తమ స్థలాన్ని ఉచితంగా ఇచ్చినందుకు  పోచారం శ్రీనివాసరెడ్డి వారిని అభినందించారు.  కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, వర్ని ఏఏంసీ చైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.