స్వార్థంతో పార్టీని వీడుతున్న వాళ్లతో నష్టం లేదు : పోచారం శ్రీనివాస్​రెడ్డి

వర్ని, వెలుగు: కొందరు లీడర్లు స్వార్థంతో పార్టీని వీడుతున్నారని, వారితో బీఆర్​ఎస్​కు వచ్చిన నష్టమేమీ లేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి వాపోయారు. మోస్రాలో కొత్తగా నిర్మించిన రెడ్డి కల్యాణ మండపాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్​ మాట్లాడుతూ..పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమన్నారు.

బీఆర్ఎస్​ అధికారం కోల్పోగానే, ఇన్నాళ్లు పార్టీ నుంచి పొందిన లబ్ధిని సైతం మరిచి కొందరు పార్టీలు మారడం విచారకరమన్నారు.  కార్యకర్తలు అధైర్య పడొద్దని ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా నిలుస్తానన్నారు. అధికార అండతో తమ పార్టీ లీడర్లపై దాడులకు తెగబడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  ప్రోగ్రాంలో మోస్రా జడ్పీటీసీ గుత్ప భాస్కర్‌ ‌రెడ్డి, ఎంపీపీ పిట్ల శ్రీరాములు,చందూరు సర్పంచ్‌‌ కర్లం సాయిరెడ్డి పాల్గొన్నారు.