డీసీసీబీ ఛైర్మన్ పదవికి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా..

నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పదవికి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. సొంత పార్టీ డైరెక్టర్లే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వటంతో భాస్కర్ రెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. డీసీసీబీకి చెందిన మొత్తం 20 మంది డైరెక్టర్లలో 15 మంది అవిశ్వాస నోటీసులు ఇవ్వడంతో..  బీఆర్ఎస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. భాస్కర్ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తారా?... అవిశ్వాస పరీక్ష పెడతారా?.. అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

కాగా, తమను లెక్కచేయకుండా..  ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతోనే పోచారం భాస్కర్ రెడ్డి తీరుపై  డైరెక్టర్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయనపై అవిశ్వాసం తీర్మానానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.  ఇటీవల జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో.. బీఆర్ఎస్ తరుఫు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు భాస్కర్ రెడ్డి ప్రయత్నిస్తున్న క్రమంలో.. ఆయనపై సొంత పార్టీ డైరెక్టర్ల నుంచి వ్యతిరేకత రావడంతో భాస్కర్ రెడ్డికి షాక్ తగిలింది.