ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పీఎం మోదీ భేటీ

బ్రెజిల్ లో జరుగుతున్న జీ 20 సమ్మిట్ సందర్భంగా  ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ద్వైపాక్షిక సమవేశమయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో సంబంధాలను బలోపేత చేయడంపై ఇరుదేశాల నేతలు ఈ సమావేశంలో చర్చించారు.  

సమావేశం అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ ఫాంX లో  ఓ పోస్ట్ చేశారు. ‘‘రియోడిజెనీరో జీ 20 సదస్సు సందర్బంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని కలిసినందుకు సంతోషి స్తున్నారు రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో సంబంధాలను పెంచుకోవడంపై మా చర్చలు జరిగాయి. సంస్కృతి, విద్యా, ఇతర రంగాల్లో సహకారం పెంపొందించే మార్గాలను కూడా చర్చించామని’’ పోస్టులో ప్రధాని మోదీ రాశారు.  

అనంతరం నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ తో మోదీ ద్వైపాక్షిక సమావేశమయ్యారు. అంతకుముందు ఇండోనేషియా, పోర్చుగల్ దేశాల నేతలతో కూడా మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో ఇరుదేశాలతో సంబంధాలను బలోపేతం దిశగా చర్చలు సాగించారు.