కువైట్ చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనంగా స్వాగతం పలికిన కువైట్ ఎమిర్

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం (డిసెంబర్ 21) కువైట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ గల్ఫ్ దేశ ముఖ్య నాయకులతో సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. 

ఇక కువైట్‌లో ఉంటున్న భారతీయులను కలుసుకుంటారు.కువైట్ ఎమిర్ షేర్ మొషల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సభాహ్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కువైట్ సందర్శించిన తొలి ప్రధాని మోదీ.. 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కువైట్ సందర్శించారు. 

పర్యటనలో భాగంగా రక్షణ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం అని భారత  అధికారులు స్పష్టం చేశారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం, రక్షణ సహకార ఒప్పందం కోసం కువైట్ తో చర్చలు జరుగుతున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శి అరుణ్ కుమార్ ఛటర్జీ అన్నారు.