PM Modi: ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం..అంతర్జాతీయ అవార్డుల లిస్ట్ ఇదే

ప్రధాని మోదీని కువైట్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో గౌరవించింది.కుబైల్ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్  ముబారక్ అల్ కబీర్ తో ప్రధాని మోదీని సత్కరించింది.  కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా ఈ అవార్డును మోదీకి అందజేశారు. 

ఇప్పటివరకు ప్రధానిమోదీ  21 దేశాలనుంచి అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ లు కూడా ఈ అవార్డును అందుకున్నారు.

ప్రపంచ దేశాలనుంచి మోదీకి దక్కిన అవార్డులు

  • హోనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడ్ ఆఫ్ బార్బడోస్ (2024) 
  • ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్(గయానా 2024) 
  • డొమినికా అవార్డు ఆఫ్ ఆనర్ (డొమినికా2024)
  • గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ (నైజీరియా2024) 
  • ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ(రష్యా2024) 
  • లెజియన్ ఆఫ్ మెరిట్ (యూఎస్ 2020)
  • ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో(భూటాన్  2024) 
  • గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ (గ్రీస్ 2023)
  • గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ మానర్ (ఫ్రాన్స్ 2023)
  • ఆర్డర్ ఆఫ్ ది నైలు (ఈజిప్ట్ 2023) 
  • గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆప్ లోగోహు(షాపువా న్యూగినియా2024) 
  • కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్ (బహ్రెయిన్ 2019) 
  • ఆర్డర్ ఆఫ్ జాయెడ్(యూఏఈ 2019) 
  • నిషాన్ ఇజ్జుద్దీన్ పాలన (మాల్దీవులు 2019) 
  • గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా (పాలస్తీనా2018) 
  • అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు (ఆఫ్గనిస్తాన్ 2016) 
  • కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్ )సౌదీ అరేబియా2016)