Shivaji Statue Collapse: కూలిన శివాజీ విగ్రహం.. క్షమాపణలు చెప్పిన ప్రధాని

మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఇటీవల 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(ఆగష్టు 30) క్షమాపణలు చెప్పారు.

శుక్రవారం మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ప్రధాని ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి తల వంచి క్షమాపణలు చెప్పారు. 

"ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంటే నాకు పేరు మాత్రమే కాదు.. ఆరాధ్యదైవం.. ఈ రోజు నేను నా దేవుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి తల వంచి క్షమాపణలు చెబుతున్నాను.." అని ప్రధాని అన్నారు.

ప్రారంభించిన ప్రధాని

దాదాపు రూ. 2.36 కోట్ల ఖర్చుతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం గతేడాది ఆగష్టు 26న నేవీ డే సందర్భంగా భారత ప్రధాని దీనిని ప్రారంభించారు. ఇటీవల కాలంలో వీచిన బలమైన గాలులకు ఈ విగ్రహం కూలిపోయింది. దీనిని తిరిగి ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.