మీకు తెలుసా : ప్లాస్టిక్ పెరిగితే పిల్లలు పుట్టరట

ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని అని అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా మహిళల్లో సంతానలేమికి కూడా ప్లాస్టిక్ కారణమవుతుందంటున్నారు నిపుణులు. అసలే టెక్నాలజీ కాలం. సెల్ ఫోన్ల వాడకం.. రేడియేషన్లు.. బయటకెళ్తే కాలుష్యం.. ఇలాంటివన్నీ మహిళల్లో సంతాన లేమికి కారణమవుతున్నాయి. వాటికితోడు ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్ కూడా వచ్చి చేరింది. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మయంగా మారింది.

ఏది తినాలన్నా, ఏ పని చేయాలన్నా ప్లాస్టిక్ లేకుండా కుదరదు. ప్లేట్లు, టీ గ్లాసులు, నీళ్ల గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లు.. ఇలా అన్నింట్లో ప్లాస్టిక్ వాడుతున్నారు. అయితే ప్లాస్టిక్ వాడడం వల్ల అందులో ఉండే విషపూరిత రసాయనాలు శరీరంలోకి చేరి.. రీప్రొడక్షన్ సిస్టమ్ ను పాడు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. రసాయనాల వల్ల హార్మోన్ వ్యవస్థ దెబ్బతింటుంది.

మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ లెవల్స్ లో తేడాలు వచ్చే ప్రమాదముంది. దీంతో రానురాను ప్లాస్టిక్ వాడకం సంతానలేమికి కారణం అవుతుందట. ఏదేమైనా ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణంతో పాటు మనిషి ఫ్యూచర్ కి కూడా ఎంతో నష్టం ఉందన్నమాట.