Beauty Tip : ప్లాస్టిక్ లూఫాతో చర్మ రోగాలు వచ్చే ప్రమాదం

చర్మం మీది మృతకణాల్ని తొలగించుకోవడానికి స్ర్కబ్భర్ లా లూఫా వాడుతుంటారు. అయితే మార్కెట్లో చాలా రకాలు ఉన్నా కొందరు ప్లాస్టిక్ లూఫా వాడతారు. దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లు రావచ్చు అంటున్నారు డెర్మటాలజిస్టులు.

* ప్లాస్టిక్ లూఫా గరుకుగా ఉంటుంది. దీంతో రుద్దుకుంటే చర్మం దురదపెడుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇ.కోలి, సూడోమోనాస్ ఆరెజినోసా, స్టఫైలోకోకస్ అనే బ్యాక్టీరియాలు పెరుగుతాయి. 

* ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కు కారణమవుతాయి. 

* తేమ ఉన్న చోట ఎక్కువ సేపు ఉండటం వల్ల లూఫా మీద బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి, లూఫాని వాడిన వెంటనే కడిగి, కొంచెంసేపు ఎండలో పెట్టాలి. 

* ఒకే లూఫాని ఎక్కువ రోజులు వాడొద్దు.

* అలాగే రోజూ వాడకూడదు. లూఫా బదులు షవర్ జెల్ (వాటర్ ఎమల్షన్ లేదా ఫ్రాగ్నెన్స్ వచ్చే డిటర్జెంట్) వాడాలి.