డివైడర్ లోని మొక్కలకు నిప్పు

ఎడపల్లి, వెలుగు : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం  బషీర్ ఫారం వద్ద నిజామాబాద్–​ -బోధన్​ ప్రధాన రహదారిపై  హరితహారంలో డివైడర్ మధ్య నాటిన​ మొక్కలకు శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. మండలంలోని బాపూనగర్ గ్రామ శివారు నుంచి జానకంపేట్​ గ్రామ శివారు వరకు రోడ్డు డివైడర్​లో మొక్కలు​ నాటారు.  కొన్ని నెలలుగా వీటిని ఎవరూ పట్టించుకోలేదు. 

మొక్కలు 75శాతం ఎండి పోయాయి.   మొక్కల మధ్య గడ్డి పెరిగి ఎండి పోయింది. ఈ గడ్డికి శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మొక్కలు కాలిపోయాయి. మొక్కలకు నీరు పెట్టలేక, గడ్డి ని తొలగించలేక ఇలా నిప్పు పెట్టి వుంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  లక్షలు వెచ్చించి నాటిన మొక్కలు ఇలా అగ్నికి ఆహుతయ్యాయి.