అరుంధతీరాయ్​కు పిన్​ పింటర్​ పురస్కారం

బుకర్​ ప్రైజ్​ విజేత, ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్​కు పెన్​ పింటర్​ –2024 పురస్కారం అందింది. అక్టోబర్​ 10న జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందజేయనున్నారు. ఇంగ్లిష్ పెన్​ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో స్థాపించిన ఈ పురస్కారాన్ని భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రతీకగా, నోబెల్​ గ్రహీత, నాటక రచయిత హరోల్డ్​ పింటర్​ జ్ఞాపకార్థం అందజేయనున్నారు. 

కశ్మీర్​పై 14 సంవత్సరాల క్రితం చేసిన వ్యాఖ్యలపై అరుంధతీరాయ్​ మీద పెట్టిన కేసులను ఉపసంహరించాలని భారత ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ విజ్ఞప్తి చేసింది.