సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

సూర్యాపేట, వెలుగు:  తెలంగాణ నాఫెడ్, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కందిలో తేమ 12 శాతం, ఇతర పదార్థాలు 2 శాతం కలిగి ఉండాలని తెలిపారు. రైతులు తమ సరుకులను నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండేలా చూసుకోవాలని చెప్పారు.  

కందులు అమ్మడానికి తెచ్చే ముందు తాలు, పొట్టు లేకుండా శుభ్రపరిస్తే సరుకు నాణ్యత పెరిగి ఆశించిన ధర రావడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ సిబ్బంది ఖాసీం, మార్క్ ఫెడ్ సిబ్బంది పాల్గొన్నారు.