లేడీ డిటెక్టివ్
టైటిల్ : పి.ఐ మీనా (వెబ్ సిరీస్)
డైరెక్షన్ : దబలొయ్ భట్టాఛార్య
కాస్ట్ : తాన్యా మణిక్తల, పరంబ్రత ఛటోపాధ్యాయ, వినయ్ పాతక్, హర్ష్ ఛయ, సౌరవ్ దాస్, జిషు సేన్‌గుప్తా, జరీనా వాహబ్, విపిన్ శర్మ
లాంగ్వేజ్ : హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
మీనా (తాన్య మణిక్తల) ప్రైవేట్ డిటెక్టివ్. కోమాలో ఉన్న తన బ్రదర్ జాయ్‌కి సంబంధించిన గతం ఆమెను వెంటాడుతుంటుంది. అయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ మాత్రం లోతుగా చేస్తుంటుంది. మీనా బాస్ ప్రీతమ్ సేన్ (హర్ష్ ఛయ). సుభోరాయ్ (పరంబ్రత ఛటర్జీ) మీనా భర్త. అతనికి మీనా అంటే చాలా ప్రేమ. అలాగే అతనికి రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి ఉంటుంది. కానీ, ప్రజలకు సేవ చేయాలని కాదు. ఇలా ఉండగా.. మీనా కళ్ల ముందే ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. పార్దో దేయ్ (సావోన్ చక్రవర్తి) బైక్‌ని ఒక లారీ ఢీ కొడుతుంది. అది చూసి షాక్ అయిన మీనా వెంటనే పార్తోని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. దీంతో పార్దో వాళ్లమ్మ ‘ఇది చిన్న విషయం కాదు. తన కొడుకుని చంపడానికి యాక్సిడెంట్ చేశార’ని చెప్తుంది. దాంతో మీనా రంగంలోకి దిగి, ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. ఈ క్రమంలో డాక్టర్ ఆండ్రే రక్ష (జిషు సేన్‌గుప్తా)ను కలుస్తుంది. ఆ తర్వాత కథేంటి? అనేదే ఈ వెబ్ సిరీస్ సారాంశం. మీనా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా, సిరీస్ కాస్త సాగదీతలా అనిపిస్తున్నా సరే.. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలి అనుకుంటే దీన్ని చూడొచ్చు.
ఆమె చావుకి కారణం ఎవరు?
టైటిల్ : ఛోటోలోక్
డైరెక్షన్ : ఇంద్రనీల్ రాయ్ చౌదరి
కాస్ట్ : దామినీ బెన్నీ బసు, ఇంద్రాని హల్దర్, ప్రియాంక సర్కార్, గౌరవ్ చక్రవర్తి, ఉశసీ రే
లాంగ్వేజ్ : బెంగాలీ
ప్లాట్ ఫాం : జీ5
రాజా (గౌరవ్ చక్రవర్తి) పెండ్లి అయిన వ్యక్తి. కానీ రూప్షా (ఉశసీ రే) అనే ఆమెతో అఫైర్ నడుపుతుంటాడు. ఆమెకి ఎవరికీ తెలియని గతం ఉంటుంది. ఆమె చనిపోవడంతో ఆ కేసులో రాజా చిక్కుకుంటాడు. ఆ కేసుని ఎస్సై సబిత్రి మొండొల్ (దామినీ బెన్నీ బసు) టేకప్ చేస్తుంది. ఆమె ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడంతో రూప్షా గురించిన విషయాలన్నీ ఒక్కోటిగా బయటకొస్తుంటాయి. ఆ క్రమంలో రాజా, భార్య మల్లిక (ప్రియాంక సర్కార్)లతోపాటు రాజకీయ పలుకుబడి ఉన్న రాజా తల్లి మొహర్(ఇంద్రాని హల్దర్)లను కలుస్తుంది. ఆ తర్వాత కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది మిగతా కథ.
మరపురాని ప్రేమ
టైటిల్ : త్రీ ఆఫ్ అజ్
డైరెక్షన్ : అవినాశ్ అరుణ్
కాస్ట్ : షెఫాలీ షా, జైదీప్ అహ్లావత్, స్వనంద్ కిర్కిరె, కాదంబరి కదమ్, పాయల్ జాదవ్
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
శైలజ (షెఫాలీ షా)ది మహారాష్ట్రలో కొంకణ్. పెండ్లి అయ్యాక భర్త దీపంకర్ (స్వనంద్ కిర్కిరె)తో కలిసి ముంబైలో ఉంటుంది. అయితే శైలజకి డిమెన్షియా అనే డిజార్డర్ స్టార్టింగ్ స్టేజిలో ఉంటుంది. దానివల్ల తన భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అందుకని ఆమె గతాన్ని మర్చిపోక ముందే తన చిన్నప్పటి రోజుల్ని గుర్తుచేసుకోవాలి అనుకుంటుంది. అందుకోసం భర్తతో కలిసి కొంకణ్ వెళ్తుంది. అక్కడ తను చదువుకున్న స్కూల్‌కు వెళ్తారు. చిన్నప్పటి స్నేహితులను కలుసుకుంటారు. అలా తిరుగుతూ ఒకరోజు పని మీద బ్యాంక్‌కి వెళ్తే.. అక్కడ వాళ్లకు ప్రదీప్ (జైదీప్ అహ్లావత్) కనిపిస్తాడు. ఇదే ఇక్కడ ట్విస్ట్! ఎందుకంటే అతనెవరో కాదు.. శైలజ చిన్నప్పుడు ఇష్టపడ్డ వ్యక్తి. మరి శైలజ, ప్రదీప్‌ని కలిసిన తర్వాత కథ ఏ మలుపు తిరుగుతుంది? అసలు వాళ్లిద్దరు ఎందుకు విడిపోయారు? శైలజ గతం మర్చిపోతుందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్‌గా మారిన అవినాశ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇందులో చిన్న చిన్న డైలాగ్‌లే ఉన్నా అవి ఆలోచింపజేస్తాయి. ఎమోషనల్‌గా హార్ట్ టచ్ చేసే సినిమా ఇది.