ఈ ఫొటో చూస్తుంటే కంగారు గిటార్​ వాయిస్తున్నట్టు అనిపిస్తుంది కదా! కానీ..

ఈ ఫొటో చూస్తుంటే కంగారు గిటార్​ వాయిస్తున్నట్టు అనిపిస్తుంది కదా!  ఫొటోగ్రాఫర్​ జాసన్ మూర్ కూడా అలా ఫీలయ్యే ఈ ఫొటో తీశాడట! అతను కారులో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన గార్డెన్​లో అన్ని కంగారులు ఫుడ్​ వెతుక్కునే పనిలో ఉంటే.. ఇది మాత్రం పసుపు రంగు పూల మధ్య నిలబడి ఇలా ఫోజులు ఇచ్చింది.

 అది గమనించిన మూర్​ వెంటనే కెమెరా తీసి క్లిక్​మనిపించాడు. ఈ ఫొటోకు పోయినేడు బెస్ట్‌‌ కామెడీ వైల్డ్ లైఫ్​ ఫొటోగ్రఫీ అవార్డు కూడా దక్కింది. అప్పటినుంచి ఇది రెగ్యులర్​గా సోషల్​ మీడియాలో షేర్​ అవుతూ ఉంది.