ఆధార్​ కార్డు ఫొటో మార్చారు..  లోన్​కొట్టేశారు....

జగిత్యాల జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో కలెక్టర్​  దరఖాస్తులను స్వీకరించారు.  బుగ్గారం మండలం మద్దూరు మండలానికి చెందిన మంజుల నారాయణ అనే వ్యక్తి తన ఐడీలు మార్చి కొంతమంది  రూ. 20 లక్షలు లోన్​ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు.2018 లో ఓ ప్రైవేట్​ బ్యాంక్​ లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ప్రైవేట్​ బ్యాంకులో  తన ఆధార్​ కార్డులో ఫొటో మార్చి లోన్​ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు.   నేరగాళ్లు పేరు.. పుట్టిన తేది, చిరునమాలను అలానే ఉంచి కేవలం ఫొటో మాత్రమే మార్చారు.

 అయితే మంజుల నారాయణ సిబిల్​ స్కోరు తగ్గిందని బ్యాంకుకు వెళ్లడంతో తన పేరున ఉన్న లోన్​ విషయం బయటపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీంతో సైబర్​ క్రైం అధికారులకు ఫిర్యాదు చేశానని..  వారు స్పందించలేదంటూ.. కలెక్టర్​ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు.