ప్రతి నలుగురు కొత్త డయాబెటిస్ పేషెంట్లలో ఒకరు 40ఏళ్ల వారే

మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతుంది. పూర్వం 60, 70 ఏళ్లు పైబడిన వారికే వచ్చే మధుమేహం.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ప్రతి నలుగురు డయాబెటిస్ పేషెంట్లలో ఒకరు నలభై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారేనని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీఘర్ లోని ప్రొఫెసర్ డాక్టర్ పూనమ్ ఖన్నా అన్నారు. డయాబెటీస్, హైపర్‌టెన్షన్, గుండె జబ్బులు మరియు క్యాన్సర్‌ లాంటి వ్యాధలతో ఉన్నవారు ఊబకాయంతో బాధ పడుతున్నారని ఆయన చెప్పారు.

చండీగఢ్‌లో  మధుమేహం యొక్క ప్రాబల్యం 20.4శాతమని మరియు అనారోగ్యకరమైన ఆహారం, నిద్ర లేకపోవడం మరియు శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా డయాబెటీస్ వ్యాధులు వస్తున్నాయని పూనమ్ చెప్పుకొచ్చారు. ఎన్‌సిడి రిజిస్ట్రీ ప్రకారం.. గత సంవత్సరంలోనే టైప్ 2 డయాబెటిస్ కేసుల సంఖ్య పెరిగింది. 18 ఏళ్లలోపు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువగా వస్తుంది.  ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మధుమేహం కేసుల పెరుగుదలకు కారణమని డాక్టర్లు చెప్తున్నారు.