పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఉద్యోగులు, కార్మికులు తమ పీఎఫ్ ను మరింత సులభంగా డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్ ను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇటీవల ప్రావిడెంట్ ఫండ్ ను ఏటీఎం లద్వారా డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే పీఎఫ్ క్లెయిమ్ ను మరింత ఈజీగా మార్చేందుకు eWallet సదుపాయం అందుబాటులోకి రానుంది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ( EPFO) పీఎఫ్ క్లెయిమ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా డ్రా చేసుకునేందుకు ATM లను ఉపయోగించి PF క్లెయిమ్ లను విత్ డ్రా చేసుకునే ఆప్షన్ తో పాటు eWallet సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెస్తోంది.
ప్రస్తు్తం ఆన్ లైన్ ద్వారా EPFO పోర్టల్ లోకి వెళ్లి పీఎఫ్ ఫండ్స్ ను డ్రా చేసుకుంటున్నారు.దీని ద్వారా EPFO ఖాతాకు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాకు 7నుంచి 10 రోజుల్లో జమ చేయడం జరుగుతుంది.
PF కోసం EWallet సదుపాయం
PF డ్రా విషయంలో ఎంప్లాయీస్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేవలు మరింత సులభతరం చేసేందుకు డిసెంబర్ 18న మరో స్టెప్ తీసుకుంది కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ. పీఎఫ్ క్లెయిమ్ ఫండ్స్ ను డ్రా చేసుకునేందుకు eWallet ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.ఈ వాలెట్ ద్వారా డైరెక్టుగా పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ మరింత ఈజీ కానుంది.
ATM ద్వారా విత్ డ్రా ఫ్యాసిలిటీ..
ATMల నుంచి నేరుగా PF విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా EPFO అందుబాటులో తెస్తున్న విషయం తెలిసిందే. 2025 ప్రారంభంలో ఈ ఫ్యాసిలిటీని ప్రారంభించనుంది. ఇప్పటికే బ్యాంకులతో దీనికి సంబంధించిన విషయాలను చర్చిస్తోంది.
eWallet, ATM లతో బెనిఫిట్స్ ..
- ఈవాలెట్ ద్వారా ఈజీగా, తక్కువ సమయంలో పీఎఫ్ డ్రా చేసుకోవచ్చు.
- బ్యాంకుల చుట్టూ తిరగకుండా .. ATM ల ద్వారా నేరుగా పీఎఫ్ డ్రా చేసుకోవచ్చు.
- పీఎఫ్ డ్రా చేసుకునేందుకు ఉద్యోగులు, కార్మికులు అనేక విధాలా సదుపాయాలు, రిస్క్ లేకుండా డ్రా చేసుకోవచ్చు.
- eWallet, ATM ఫ్యాసిలిటీ అందుబాటులోకి వస్తుందంటే..
- 2025 ప్రారంభం నుంచి ఈ ఫ్యాసిలిటీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులతో సంప్రదించి ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ వ్యాలెట్, ఏటీఎం ఫ్యాసిలిటీ అమలు కానుంది.