Good News : పెట్రోల్‌‌, డీజిల్ ధరలు తగ్గే చాన్స్‌‌? : పంకజ్ జైన్

న్యూఢిల్లీ : పెట్రోల్‌‌, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.  గ్లోబల్‌‌గా క్రూడాయిల్ ధరలు తగ్గాయని, మరికొంత కాలం పాటు కనిష్ట స్థాయిల్లోనే కొనసాగితే  ఇండియాలో  పెట్రోల్‌‌, డీజిల్‌‌  ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించొచ్చని  పెట్రోలియం మినిస్ట్రీ సెక్రెటరీ పంకజ్ జైన్ అన్నారు. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌‌కు 70 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.  2021 డిసెంబర్ తర్వాత ఇదే కనిష్ట స్థాయి.

 క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉండడంతో ఆయిల్ కంపెనీల మార్జిన్స్ భారీగా పెరిగాయి. మరోవైపు ఒపెక్ ప్లస్ దేశాలు క్రూడాయిల్ ప్రొడక్షన్ పెంచాలని  ఇండియా కోరుతోంది. అలానే  రష్యా వంటి సప్లయర్ల నుంచి భారీగా ఆయిల్ కొనుగోలు చేస్తోంది.

Also Read:-మీ అంకితభావం గొప్పది