Video Viral:  వామ్మో.. ఇదేం టీ రా నాయినా.. తాగితే  పరలోకానికి పయనమే..

టీ అనేది భారతీయులకు ఒక ఎనర్జీ డ్రింక్. పొద్దున్నే నిద్ర లేవాలన్నా, పనికి వెళ్లాలన్నా, అలసట పోగొట్టుకోవాలన్నా.. టీ తాగుతుంటారు . టీ చాలా రకాలు ఉన్నాయి. పాలు, పంచదార, టీ ఆకులతో తయారైన టీ ఇప్పుడు అనేక రకాలుగా తయారవుతోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా టీ ని తయారు చేస్తుంటారు.  ఓ వ్యక్తి తయారు చేసిన టీ ని చూస్తే.. ఎందుకంటే మీరు జన్మలో ఇక టీ తాగరు.. ఇంతకూ ఆ టీని దేనితో తయారు చేశారనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

మనలో కొంతమందికి టీ అంటే చాలా ఇష్టం.ఇక వారికి ఎలాంటి పనుల్లో విసిగి వచ్చిన లేదా తలనొప్పిగా అనిపించినా ముందుగా వారికి గుర్తు వచ్చేది టీ తాగడం. అల్లంటీ, లెమన్​ ఛాయ్​, బటర్​ టీ, ఇలా చాల రకాలు టీని తాగుతుంటారు.  కాని ఇప్పుడు చెప్పబోయే టీ ని తాగితే .. ఇక నేరుగా పరలోకాని పయనమే నట.. అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

ఒక వ్యక్తి టీ చేసే విధానాన్ని చూసి టి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తి టీ తయారు చేసేందుకు అన్ని సిద్ధంగా ఉంచుకొని ముందుగా స్టవ్ పై టీ పాత్రను పెట్టి అందులో టీ పొడి ,పాలు, చక్కెర వేస్తాడు.ఇంతవరకు అంతా బాగున్నా.కానీ., ఒక్కసారిగా ఆ వ్యక్తి స్టవ్ పక్కనే ఉన్న పెప్సీ బాటిల్ ని తీసుకొని టీ పాత్రలో పోస్తాడు.ఆ తర్వాత వాటన్నిటిని బాగా ఉడికించిన తర్వాత ఆ వేడివేడి టీ ను గ్లాసులలో వేసి కస్టమర్లకు అందించడం మనం చూడవచ్చు.

ఇక ఈ వీడియో చూసిన కొంతమందిని నెటిజన్స్ ఇది టీ కాదు విషం అంటూ., ఇది ఎక్కడి టీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది తాగితే నేరుగా పరలోకానికే జర్నీ అంటూ పోస్ట్​ లు పెడుతున్నారు.  ఈ వీడియోను చూసిన కొంతమంది టీ లవర్స్ ఇలాంటి టీ చూస్తే మళ్లీ ఎప్పుడు కూడా టీ తాగాలని కూడా అనిపించదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

 వివిధ రకాలుగా టీ చేయడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అంతేకాకుండా సోషల్ మీడియాలో అనేక రకాలుగా వంటలు చేయడం, స్నాక్స్ చేయడం లాంటివి ఈ మధ్య వైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాము. మ్యాగీతో సమోసాలు చేయడం., బిస్కెట్లతో పకోడీ చేయడం లాంటి వీడియోలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూన్నాయి.