- జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్
జగిత్యాల టౌన్, వెలుగు: డబుల్ బెడ్ రూం ఇండ్ల పెండింగ్ పనులను స్పీడప్ చేయాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నూకపల్లిలోని డబుల్ బెడ్ రూం, జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం గొల్లపల్లి మండలంలోని కేజీబీవీని పరిశీలించారు.క్లాస్ రూమ్‌లను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని టీచర్లకు సూచించారు.