పెద్దాపూర్ గురుకుల స్కూల్ రీ ఓపెన్

  • పేరెంట్స్ తో మీటింగ్ నిర్వహించిన ప్రిన్సిపాల్ 
  • తొలిరోజు 20 మంది ఇంటర్ స్టూడెంట్స్ హాజరు 

మెట్ పల్లి, వెలుగు : జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల స్కూల్ నెల రోజుల తర్వాత బుధవారం రీ ఓపెన్ చేశారు. 540 విద్యార్థులకు గాను తొలి రోజు 20 మంది ఇంటర్ స్టూడెంట్స్ హాజరయ్యారు. పలువురు పేరెంట్స్ తమ పిల్లలతో స్కూల్ కు వచ్చి చేర్పించారు.   వసతులను పరిశీలించారు. పేరెంట్స్ తో ప్రిన్సిపాల్ మాధవీలత మీటింగ్ నిర్వహించి.. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 

ఉన్నతాధికారుల ఆదేశాలతో స్కూల్ ను రీ ఓపెన్ చేశామని ఎక్కువ సంఖ్యలో పిల్లలు రాకపోవడంతో గురువారం నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు. నెల రోజుల కింద  స్కూల్ లో అస్వస్థతతో ఇద్దరు విద్యార్థుల మృతిచెందగా.. మరో నలుగురు  అస్వస్థతకు గురవగా భయంతో పేరెంట్స్ తమ పిల్లలకు ఇండ్లకు తీసుకెళ్లగా.. దీంతో అధికారులు స్కూల్ కు హాలిడేస్ ప్రకటించినది తెలిసిందే. 

డిఫ్యూటీ సీఎం నిధులు రిలీజ్ తో రిపేర్లు

విద్యార్థుల మృతి ఘటన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  స్కూల్ ను సందర్శించి పేరెంట్స్ తో మాట్లాడి.. ఇకముందు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.  వెంటనే రూ.50 లక్షలు నిధులు కూడా మంజూరు చేశారు. దీంతో   స్కూల్ లో వివిధ పనులను చేప్టటారు. విద్యార్థులకు బెడ్లు, డ్యూయల్ డెస్కులు సమకూర్చారు. డైనింగ్ హాలుకు పెయింటింగ్, కొత్త కిటికీలు, కిచెన్ ను క్లీన్ చేయించారు.