స్టూడెంట్లను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకం :ఎంపీ గడ్డం వంశీకృష్ణ

  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ..
  • జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌లో ఉపాధ్యాయ దినోత్సవం

జగిత్యాల, వెలుగు:విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడంలో గురువుల పాత్ర కీలకమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌లో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్‌‌‌‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌‌‌‌ ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. చదువుతో ఏదైనా సాధ్యమని, చదువే బలమని కాకా వెంకటస్వామి చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.

బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ అంబేద్కర్ కాలేజీని ఏర్పాటు చేశారని, అందులో ఏడాదికి 5 వేల మంది స్టూడెంట్స్‌‌‌‌ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పిల్లలకు చిన్న వయసులోనే మహిళలను గౌరవించడం నేర్పించాలని సూచించారు. టీచర్లు.. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఎందరినో ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారని, సత్య నాదెళ్ల, సుందర్‌‌‌‌‌‌‌‌ పిచాయ్ లాగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. 

విద్యాదానం ఎంతో గొప్పది: అడ్లూరి

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ మాట్లాడుతూ, విద్యా దానం ఎంతో గొప్పదని, గురువులకు రుణపడి ఉంటామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఆర్థికంగా వెనుకబడి వారే ఎక్కువగా వస్తారని, వారిని గొప్పగా తీర్చిదిద్దిన ఘనత టీచర్లదేనని ప్రశంసించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.

అంతకు ముందు గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి కుమార్తెలు, శ్లోకా రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి నూతన వస్త్రలంకరణ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిలతో కలిసి ఎంపీ హజరయ్యారు.