ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్​ ఏఈ

  • రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఇరిగేషన్​ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన శ్రీనివాస్ యాదవ్  జూలపల్లి మండలంలో రూ.90 వేలతో కెనాల్​ పనులు పూర్తి చేశాడు. ఆ పనులకు సంబంధించిన బిల్లుల కోసం  కాంట్రాక్టర్​ ఏఈ నర్సింగరావును కలిశాడు.

 బిల్లు రిలీజ్​ కావాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్​ చేశాడు. దీంతో కాంట్రాక్టర్​ శ్రీనివాస్​ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు డబ్బులు తీసుకునేందుకు కలెక్టరేట్​ ముందున్న ఓ షాపు వద్దకు ఏఈని రమ్మన్నాడు. అక్కడ కాంట్రాక్టర్​ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏఈని ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. దాడుల్లో సీఐ కృష్ణ కుమార్, ఎస్సైలు పున్నంచంద్, తిరుపతి పాల్గొన్నారు..