ఓదెల మండలంలో ఎంపీ, చెన్నూర్​ ఎమ్మెల్యే పర్యటన

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు కుటుంబాలకు చెందిన శుభకార్యాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్​ఎమ్మెల్యే గడ్డం వివేక్​ వెంకటస్వామి హాజరయ్యారు. ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన మ్యాడగోని మల్లేశం కుమార్తె అనూష వివాహం నేడు జరగనుంది. బుధవారం ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఆమెను ఆశీర్వదించారు.

అలాగే ఓదెల మండల కేంద్రానికి చెందిన అల్లం సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్తె హర్షిక నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. వారివెంట నాయకులు సజ్జాద్​, బాలసాని సతీశ్, గుండేటి ఐలయ్యయాదవ్​, గంగుల సంతోష్​, బండారు సునీల్​, కొండి సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రశాంత్​, శ్రీనివాస్ తదితరులున్నారు. 

బాబర్ సలీం పాషకు పరామర్శ

జ్యోతి నగర్, వెలుగు : ఐన్టీయూసీ జాతీయ కార్యదర్శి, ఎన్బీసీ మెంబర్ బాబార్ సలీం పాష మంగళవారం గుండె పోటుకు గురై కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స తీసుకుంటున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బుధవారం బాబర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.