పెద్దపల్లి ఎమ్మెల్యేకు ఎంపీ పరామర్శ

సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ రాజన్నసిరిసిల్ల, వెలుగు : పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావును పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. ఎమ్మెల్యే సతీమణి పావని తండ్రి పర్వతనేని మాధవరావు(83) అనారోగ్యంతో బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట.

అంత్యక్రియల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ఆయనను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. మాధవరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.